హాస్టళ్ళను ఎత్తివేయవద్దంటూ విద్యార్ధుల నిరాహారదీక్ష

0
316

రాజమహేంద్రవరం, నవంబర్‌ 10 : రాష్ట్రంలో బిసీ, ఎస్సీ హాస్టళ్ళ ఎత్తివేతను ప్రభుత్వం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ బిసీ విద్యార్ధి సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద హాస్టల్‌ విద్యార్ధులతో కలిసి బి సీ స్టూడెంట్స్‌ ఫె డరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మారుస్తామని చె బుతున్న ప్రభుత్వం బిసీ, ఎస్సీ వసతి గృహాలను తొలగించేందుకు కుట్ర పన్నుతో ందన్నారు. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలను మూసివేసిందని, ప్రస్తుతం మరో 400 హాస్టళ్ళను ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తెలంగాణా ప్రభుత్వం మాదిరిగా బిసీ, ఎస్సీల హాస్టళ్ళలో సన్న బియ్యం, వారానికి ఒకసారి మాంసాహారంతో భోజనం పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయుడు రాకేస్‌ , బర్ల సీ తారత్నం, కెకె సంజీవరావు, ఇందన నాగేశ్వరరావు, గుత్తుల సత్యనారాయణ, గుత్తుల భాస్కర్‌, పరశురామ్‌, జగదీష్‌, హాస్టల్‌ విద్యార్ధులు పాల్గొన్నారు.