హాస్యనటుడు రాజబాబుకు ఘన నివాళి

0
290
రాజమహేంద్రవరం, అక్టో బర్‌ 23 : హాస్య నటుడు స్వర్గీయ రాజబాబు 81వ జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబూ స్టూడియో అధినేత ముసిని బాబూ రావు, కాశీ లక్ష్మి, నారాయణ (బాబి), కట్టా పూర్ణ, చంద్రరావు, కె.సుందరం, పెంటపాటి సుభాష్‌, రాజబాబు మేనల్లుడు బి.ఎస్‌.ఎన్‌. ఎల్‌.వాసు తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.