హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

0
295

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 : ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విజయవాడకు చెందిన హనుమంతరావు 1956 అక్టోబర ్‌10న జన్మించారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 18 వ ఏటనే నాటక రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత అహ నా పెళ్ళంట చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి 400కు పైగా చిత్రాల్లో హాస్యపాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అలాగే పలు టీవీ సీరియళ్ళలో కూడా ఆయన నటించారు. ఈ సాయంత్రం ఆయన భౌతికకాయానికి హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here