హొటల్ షెల్టన్‌ ఆధ్వర్యంలో అన్నదానం

0
390
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 24 : అధునాతన సౌకర్యాలతో చక్కని ఆతిధ్యమిస్తూ, నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆనందింప చేస్తున్న హొటల్ షెల్టన్‌ ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పదివేల మందికి హొటల్ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా షెల్టన్‌ ఎండి కొడాలి సుధాకర్‌, షెల్టన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వైస్‌ ఛైర్మన్‌ కొడాలి తనూజ, వారి పిల్లలు కొడాలి నిత్య, కొడాలి జయేష్‌లు జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. హొటల్ షెల్టన్‌ వ్యాపార ధృక్పథమే కాకుండా చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, పేదలకు మందులు పంపిణీ చేయడం, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు.  ఈ కార్యక్రమంలో షెల్టన్‌ జనరల్‌ మేనేజర్‌ ఉపేంద్ర సింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ సయ్యద్‌ మెహబూబ్‌, ఫ్రంట్‌ ఆఫీసర్‌ మేనేజర్‌ శివ కల్యాణ్‌, ఎఫ్‌ అండ్‌ బి మేనేజర్‌ కృష్ణ, హెచ్‌.ఆర్‌. మేనేజర్‌ అర్జున్‌, హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌ సతీష్‌, ఐటి మేనేజర్‌ శ్రీనివాస్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ ధర్మేంద్ర సింగ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here