హొమియోపతి కళాశాలలో పీజీ కోర్సులు

0
376
18 సీట్లతో మంజూరు -ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : నగరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ ¬మియోపతి కళాశాలకు 18 పోస్టుగ్రాడ్యుయేషన్‌ సీట్లు మంజూరు అయ్యాయని నగర శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. స్ధానికహొమియోపతి హాస్పటల్‌లో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంలోని ఆయుష్‌ శాఖ అల్లోపతితో పాటు ఇతర ఆయర్వేద, హొమియోపతి, సిద్ధ వైద్య విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కళాశాలలో పిజి విభాగం ఏర్పాటుకు కళాశాల సిబ్బంది కృషిని అభినందించారు. 18 పిజి సీట్లు రావడానికి సహకరించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఎం వెంకయ్యనాయుడు, ఆయుష్‌ శాఖామంత్రి యషో నాయక్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాలలో పూర్తిస్ధాయి మౌళిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకానికి రాష్ట్ర వైద్యశాఖ చర్యలు చేపడుతుందన్నారు. వైద్యం ఖరీదైన వస్తువుగా అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత పటిష్టవంతం చేయడానికి కేంద్రం కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఆయుష్‌ ద్వారా వైద్య రంగంలోని అన్ని విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. పిజి కోర్సులో చేరిన విద్యార్ధులను ఈ సందర్భంగా అభినందించారు. హొమియోపతి కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ పి సూర్యభగవాన్‌ మాట్లాడుతూ పిజి సీట్లు రావడంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అందించిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.  పిజి సీట్లు మంజూరైన నేపధ్యంలో అవసరమైన ఫ్యాకల్టీ, ఇతర మౌళిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే అవకాశం ఉందన్నారు.