10న రాజమహేంద్రవరంలో యాదవ కార్తీక వన సమారాధన

0
100
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : అఖిలభారత యాదవ మహాసభ కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా కమిటీ అధ్యక్షుడు, వనసమారాధన కమిటీ నిర్వాహకుడు బర్ల బాబూరావు వెల్లడించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన యాదవ సంఘం నాయకులు మరుకుర్తి దుర్గాయాదవ్‌, కర్నాని అన్నపూర్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ వనసమారాధనకు హాజరవుతున్నట్టు తెలిపారు. యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంగా ఈ కార్తీన వనసమారధనలో రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు అందచేస్తామన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, మధుసూధనరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. వారితో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, వెస్లీ దంపతులను కూడా ఘనంగా సత్కరిస్తామన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా బీసీలందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. స్థానిక జెఎన్‌ రోడ్‌  ఏకేసీ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభు గార్డెన్స్‌లో జరిగే ఈ కార్తీక వనసమారాధనకు  10 నుంచి 15 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా యాదవ కులస్థులందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా..ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. యాదవుల ఐక్యత చాటేలా ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు పద్మావతి, కొల్లి వినయకుమారి, నొడగల శ్రీహరిలక్ష్మి, పిన్నింటి ప్రసాద్‌, చంద్రాడ రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here