11న మాదిగల వన సమారాధన

0
282
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 6 : నగరంలోని పదమూడు మాదిగల పేట నుంచి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఈనెల 11న వన సమారాధన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మాదిగ జెఏసీ స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధులు తుత్తరపూడి రమణ, చాపల చిన్నిరాజు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగల ముసుగులో కొంతమంది తమ జాతిని అగౌరవపరుస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే తాము సంఘటితమయ్యామన్నారు. అందులో భాగంగానే 13 పేటల నుండి స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో ఈతలపాటి కృష్ణ, దొండపాటి కృష్ణాఫర్‌, బల్లంకుల రాజు తదితరులు పాల్గొన్నారు.