14న మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయం ప్రారంభం

0
281
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 :  మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌ సింగ్‌ 1987లో స్థాపించిన అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయాన్ని ఈ నెల 14న ప్రారంభిస్తున్నట్టు ఎఐహెచ్‌ఆర్‌ సభ్యుడు శ్రీనివాస్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌, జాతీయ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఎం.యు. దువా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యాలయం ప్రారంభించిన అనంతరం వాక్ఫర్‌ క్రియేటింగ్‌ ఎవైర్‌.నెస్‌ ఆన్‌ హూమన్‌ రైట్స్‌ (మానవ హక్కుల మీద అవగాహన కల్పించడానికి) నిర్వహిస్తున్నామని, ఆంధ్రా, తెలంగాణాకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు గౌరవ జస్టిస్‌ టి. అమర్‌ నాధ్‌గౌడ్‌ పాల్గొంటారని తెలిపారు. ర్యాలీ ఆ రోజు ఉదయం 11 గంటలకు 12గం.వరకూ తిలక్‌ రోడ్డులోని కార్యాలయం నుండి ఆనం రోటరీ క్లబ్‌ వరకూ జరుగుతుందన్నారు. తరువాత ఆనం రోటరీ హాలులో సాయంత్రం 5 గంటల వరకూ సదస్సు జరుగుతుందన్నారు. వివరాలకు సెల్‌ : 91547 09948, 94917 67119, 82478 53289 నెంబర్లలో  సంప్రదించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here