15న తిరువాభరణాలతో ఊరేగింపు

0
124
రాజమహేంద్రవరం,జనవరి 13: చారిత్రక  నగరంలో గోదావరి తీరాన ఉత్తర శబరిగా పేరుగాంచిన శ్రీ అయ్యప్ప స్వామి వారి తిరువాభరణాల మ¬త్సవాన్ని దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు స్వగృహం నుంచి ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు నిర్వహిస్తున్నట్లు శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ప్రతినిధులు వెల్లడించారు. ఈరోజు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రం ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకర్రావు, తోట సుబ్బారావు, పొలసానపల్లి హనుమంతరావులు మాట్లాడారు. ఆలయ గురుస్వాముల పర్యవేక్షణలో బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జక్కంపూడి విజయలక్ష్మి, కొమ్ముల సాయి తిరువాభరణాలు మ¬త్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి వారి తిరువాభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యముల, కోలాటములు, డోలు సన్నాయి మేళ తాళములు, సింగారి మేళములతో అశేష భక్తజనులు మాలదారులైన స్వాములతో ఊరేగింపుగా బయలుదేరి స్వామికి తిరువాభరణములు అలంకరిస్తామని తెలిపారు. ఈ ఊరేగింపు ప్రకాశం నగర్‌ నుంచి టిటిటి కళ్యాణ మండపం, నందం గనిరాజుజంక్షన్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌, లక్ష్మీవారపు పేట, కోటగుమ్మం, మెయిన్‌ రోడ్డు, డీలక్స్‌ సెంటర్‌, టి.నగర్‌ విశ్వేశ్వర స్వామి గుడి మీదుగా జరుగుతుందన్నారు. సాయంత్రం 6.45 గంటలకు అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి దర్శనం కార్యక్రమం ఉంటుందన్నారు. రాత్రి పది గంటలకు పవళింపు సేవ, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమాల్లో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్రం ప్రతినిధులు మంతెన కేశవరాజు, గాదె చలపతి గురుస్వామి, దవులూరి రామకృష్ణ, యిమ్మంది మోహనరావు, మన్నె సుబ్బారావు, బళ్ళ సత్యనారాయణ, చలగళ్ళ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here