15న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం

0
130
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన శ్రీ రామానుజ లక్ష్మీ శ్రీనివాస వాసవీ చారిటబుల్‌ ట్రస్ట్‌ శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం ఆధ్వర్యంలో ఈనెల 15న ఉదయం 9.30 గంటల నుండి జె.ఎన్‌.రోడ్‌లోని మన్యం గార్డెన్స్‌లో శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. వాడవాడలా పర్యటించి 108 శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు, 108 కోట్ల ‘ఓం నమో వెంకటేశాయ’ నామ లిఖిత మహా యజ్ఞాన్ని జరపాలని భావించి శ్రీ రామానుజ లక్ష్మీ శ్రీనివాస వాసవి చారిటబుల్‌ ట్రస్ట్‌ వారిచే ఇప్పటికే ఎనిమిది చోట్ల స్వామివారి కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. తొమ్మిదవ శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని చారిత్రక రాజమహేంద్రవరంలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు 9 గంటల నుండి అన్నమాచార్య సంకీర్తనలతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ట్రస్ట్‌ సభ్యులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here