15 నుంచి స్పోర్ట్స్‌ మీట్‌

0
155
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9 : ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ రాజమహేంద్రవరంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సెమినార్‌ కం స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం జోన్‌ పిఈటి మరియు ఎస్‌ఎ(పిఈ) అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు జికెఎన్‌వి రమణ మూర్తి, అధ్యక్షులు ఎవిడి ప్రసాదరావు, జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వీరబాబు వెల్లడించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సెమినార్‌ కం స్పోర్ట్స్‌ మీట్‌లో జిల్లాకు చెందిన 700 మంది వ్యాయామ ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో గల 13 జోన్ల నుండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క జోన్‌ వారు ఈ సెమినార్‌ ను నిర్వహిస్తున్నారని తెలిపారు. 2004 సంవత్సరంలో రాజమండ్రి జోన్‌ వ్యాయామ ఉపాధ్యాయులు ఈ మీట్‌ను నిర్వహించడం జరిగిందన్నారు. తిరిగి ఈ ఏడాది రాజమండ్రి జోన్‌ నిర్వహిస్తున్నదన్నారు. ఈ సెమినార్లో కొత్తగా మారిన ఆటలలోని నియమ నిబందనలు మరియు నిష్ణాతులైన వారిచే అవగాహన సదస్సు ద్వారా పాఠశాలలలోని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అలాగే దీని వలన వ్యాయామ ఉపాధ్యాయులు మారిన నియమనిబంధనల ద్వారా తన యొక్క చాతుర్యాలను అభివ ద్ధి పరచుకొనుటకు దోహదపడుతుందన్నారు. అంతే కాకుండా పురుషులకు అథ్లెటిక్స్‌, బాస్కెట్‌ బాల్‌, బాలబ్యాటిమెంటన్‌, బ్యాట్‌ మెంటెన్‌, వాలీబాల్‌, కబడ్డీ పోటీలు అలాగే మహిళలకు టెనికాయిట్‌, త్రోబాల్‌, బ్యాట్‌ మెంటెన్‌ పోటీలు నిర్వహించబడతాయన్నారు. ఈ సెమినార్‌ కం గేమ్స్‌ మరియు స్పోర్ట్స్‌ విద్యాశాఖాధికారుల అనుమతితో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు రోజులు ఇక్కడకు వచ్చే వ్యాయమ ఉపాధ్యాయులకు అల్పాహార భోజన, వసతి సదుపాయములను రాజమహేంద్రవరం పట్టణంలోని ప్రముఖుల పెద్దలు, వస్త్ర వ్యాపారులు, తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, జిల్లాలో గల విద్యా సంస్థలు, రాజకీయ ప్రముఖులు మరియు జిల్లాలో గల ఇతర వ్యాయామ సోదర, సోదరీమణుల ఆర్ధిక సహాయ సహకారాలతో నిర్వహణ జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ కోశాధికారి టి.బాపిరాజు, పిఈటిలు పి.జీవన్‌దాస్‌, జె.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here