16న ద్విగుణిత అష్టావధానం, పుస్తకావిష్కరణ

0
409
రాజమహేంద్రవరం, అక్టోబరు 13 : జనభావన సాంస్కృతిక సంస్థ, శ్రీవిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అవధాన అష్టాపద తాతా శ్రీనివాస రమాసత్య సందీప శర్మ ద్విగుణిత అష్టావధానాన్ని నిర్వహిస్తారు.  ముందుగా ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ రచించిన ‘సూఫీ-ఖురాన్‌’ పుస్తకాన్ని పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా ఆవిష్కరిస్తారు. సాహిత్యాభిమానులు హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.