17న  వెలమ సంఘీయుల వన సమారాధన

0
244
రాజమహేంద్రవరం,నవంబర్‌ 9:  వెలమ సంఘీయుల వన సమారాధనను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్టు వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు చల్లా శంకరరావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)లు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోరంపూడి నుంచి నామవరం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న గొర్రెల సూరి అప్పారావు గార్డెన్స్‌లో వెలమ సంఘీయుల వన సమారాధన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 35 వేల మంది ఈ వనసమారాధనకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా అనేక సాంస్క తిక కార్యక్రమాలు, పిల్లలు, పెద్దలకు వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా వెలమ సంఘీయులు వివిధ ట్రస్టుల ద్వారా కుల, మత బేధాలు లేకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేద విద్యార్ధులను ఆర్ధికంగా ఆదుకోవడం, పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన శస్త్ర చికిత్సలు  చేయిస్తున్నామన్నారు. తమ సంఘీయులందరిదీ ఒకే మాట… ఒకే బాటని స్పష్టం చేశారు. పేదలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. వెలమ సంఘం ప్రతినిధులు అల్లు బాబి, సప్పా ఉమా మహేశ్వరరావు, కొల్లి వెంకటదుర్గా ప్రసాద్‌, సప్పా వెంకట రమణ, కొల్లి బుజ్జి, యాళ్ల రవి, సతీష్‌, ప్రసాద్‌, భూషణం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here