17న శెట్టిబలిజ కార్తీక వనసమారాధన

0
148
మహాపుష్కరవనంలో నిర్వహణకు ఏర్పాట్లు..
రాజమహేంద్రవరం, నవంబర్‌ 14 : గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత, ఈడిగ సంక్షేమ సంఘం కార్తీక వనసమారాధన కార్యక్రమం ఈనెల 17వ తేదీన రాజమహేంద్రవరం గోదావరి మహా పుష్కరవనంలో నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ వెల్లడించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో  వనసమారాధనకు నిర్వహణ సారధ్యం వహిస్తున్న కోడి ప్రవీణ్‌, ఆహ్వాన కమిటీ ప్రతినిధులు వాసంశెట్టి గంగాధరరావు, కడియాల వరబాబు, దంగేటి వీరబాబు, రాయుడు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్‌ పిల్లి నిర్మల తదితరులు మాట్లాడారు. గీత కులాల కుటుంబాలన్నీ కలవాలని అందరూ ఐక్యంగా ఒక రోజు ఆనందంగా గడపాలనే ఉద్దేశ్యంతో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పుష్కరవనం గేట్‌-1ను వేదికగా ఏర్పాటు చేస్తున్నామని దానికి సర్దార్‌ గౌతు లచ్చన్న ప్రాంగణంగా, విందు జరిగే ప్రాంతానికి దొమ్మేటి వెంకట రెడ్డి ప్రాంగణంగా పేరు పెడుతున్నట్టు వివరించారు. గత కొన్నేళ్లుగా శెట్టి, బలిజ కార్తీక వనసమారాధన కార్యక్రమం జరగడం లేదని ఈ ఏడాది కోడి ప్రవీణ్‌ ముందుకు వచ్చి నిర్మాణ సారధ్యం వహిస్తున్నట్టు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌, సిటీ, రాజానగరం నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున గౌడ, శెట్టిబలజ సంఘీయులు హాజరై వనసమారాధనలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేసారు. గౌరవ ఆత్మీయ అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, శాసనమండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, అంగర రామ్మోహన్‌, ఎమ్మెల్యే జోగి రమేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరవుతున్నారన్నారు. ప్రత్యేక ఆత్మీయ ఆహ్వానితులుగా మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, గౌరవ ముఖ్య అతిథులుగా కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు దొమ్మేటి వెంకటేశ్వర్లు, పిల్లి అనంతలక్ష్మీ సత్యనారాయణమూర్తి, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీనివాస్‌, మాజీ మేయర్‌ కవికొండల సరోజ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. సంఘీయులకు ఆటలు, పాటల పోటీలు, హౌసి నిర్వహిస్తున్నామని విజేతలకు టెలివిజన్‌, బీరువాలు, లక్కీడిప్‌ తీసి బహుమతులు కూడా అందచేస్తామన్నారు. సమావేశంలో సంఘం నాయకులు పిల్లి వెంకట రమణ, ఆనెం చిన్న, ఆనెం చంటి, గోపాలకృష్ణ, కుడుపూడి నాగేశ్వరరావు, మిద్దే కిషోర్‌, కేతా జ్యోతి స్వరూప్‌, దుంగా సురేష్‌, మద్ది హరిశంకరరావు, గుత్తుల సత్యనారాయణ, దొమ్మేటి వెంకట రామకృష్ణ, పితాని పైడిరాజు, కుడుపూడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here