18న కాశీ నవీన్‌కు అభినందన సత్కారం

0
245

రాజమహేంద్రవరం, జూన్‌ 16 : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన దళితరత్న కాశి నవీన్‌కుమార్‌కు ఈనెల 18న మోరంపూడి సెంటర్‌లోని శుభమస్తు ఫంక్షన్‌ హాలులో అభినందన సత్కారం నిర్వహిస్తున్నట్లు కాశి నవీన్‌ మిత్ర బృందం ప్రతినిధి మరుకుర్తి రవి యాదవ్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, దళిత నేతగా ఎన్నో ఏళ్ళుగా కష్టపడి పనిచేస్తూ ఎన్నో పోరాటాలు సాగించిన కాశి నవీన్‌ సేవలను సీఎం చంద్రబాబునాయుడు గుర్తించి ఉన్నతమైన పదవిని కట్టబెట్టారన్నారు. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నవీన్‌ ఈ పదవి ద్వారా అనేకమంది దళితుల అభ్యున్నతికి కృషిచేస్తారని తెలిపారు. 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు నవీన్‌ ఇంటి నుంచి 400 స్కూటర్లు, 50 కార్లతో ర్యాలీ ప్రారంభమవుతుందని, అక్కడ నుంచి క్వారీ మార్కెట్‌, కోరుకొండరోడ్‌ మీదుగా కంబాలచెరువు, దేవీచౌక్‌, గోకవరం బస్డాండ్‌, లక్ష్మివారపుపేట, అజాద్‌చౌక్‌, తాడితోట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా శుభమస్తు ఫంక్షన్‌ హాలుకు చేరుకుంటామన్నారు. అక్కడ 6 గంటలకు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అధ్యక్షతన సభ జరుగుతుందన్నారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎక్సైజ్‌ శాఖామంత్రి కె.ఎస్‌.జవహర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు హాజరవుతారని తెలిపారు. కాశి నవీన్‌కుమార్‌ ఎదుగుదలలో మీడియా పాత్ర ఎంతో ఉందని, ఆయన మిత్ర బృందం ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, కార్పొరేటర్‌ మర్రి దుర్గాశ్రీనివాస్‌, పార్టీ నాయకులు కవులూరి వెంకట్రావు, మళ్ళ వెంకట్రాజు, జాలా మదన్‌, కాకర్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here