మోదీ వ్యతిరేక వార్తలకు కార్పొరేట్ కట్టడి (శనివారం నవీనమ్)

0
387

మోదీ వ్యతిరేక వార్తలకు కార్పొరేట్ కట్టడి

(శనివారం నవీనమ్) 

 అపుడు…విమర్శలను సహించలేని ఇందిరాగాంధీ ఎమర్జన్సీ విధించి ప్రెస్ సెన్సార్ షిప్ అమలు చేశారు. ఇపుడు కెసిఆర్ తనను విమర్శించే టివిచానళ్ళ ప్రసారాలను నిలుపుదల చేయిస్తారు. రాజకీయ పార్టీలు సొంత చానళ్ళను పెట్టుకోవడం వల్లా, చానళ్ళే రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూండటం వల్లా పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా హక్కు వివాదాస్పదమయ్యాయి.

అధికారంలో వున్నవారికి నచ్చని మీడియా నోరునొక్కడానికి రాజకీయపలుకుబడి వుపయోగించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం ప్రభుత్వ అడ్వర్టయిజ్ మెంట్లు ఆపివేయడం…అప్పుడూ ఇప్పుడూ జరుగుతున్నదే. 

పాలకులను విమర్శించే మీడియాను నేరుగా కార్పొరెట్ రంగమే కట్టడిచేయడం నరేంద్రమోదీ హయాంలో మొదలైన కొత్తధోరణి. 

లాభాలతో నడుస్తున్న ఆనందబజార్ పత్రిక గ్రూపు లోని హింది న్యూస్ టివి చానల్ “ఎబిపి” చీఫ్ ఎడిటర్ పుణ్యప్రసూన్‌ బాజ్‌పేయి, న్యూస్ ప్రొడ్యూసర్ మిలింద్‌ ఖండేకర్ లతో యాజమాన్యం రాజీనామా చేయించింది.  వీరు “మాస్టర్ స్ట్రోక్” అనే ప్రోగ్రామ్ లో వార్తల్లో నిజానిజాలను విశ్లేషిస్తారు. 

నైపుణ్యాల వృద్ధి లో భాగంగా స్వయంగా నరేంద్రమోదీ చెప్పిన అంకెలు వాస్తవాలు కాదని కోటిమంది స్త్రీలు ఇందువల్ల ఉపాధి పొందారని మోదీ చెపుతున్నప్పటికీ లబ్దిదారుల సంఖ్య వేలల్లోనే వుందని వీరు ఆధారాలతో సహా కధనాన్ని సిద్ధం చేశారు. మోదీ పేరులేకుండా ప్రసారం చేయాలని యాజమాన్యం సూచించింది. మోదీ ప్రస్తావన లేకపోతే వార్తే లేదని చీఫ్ ఎడిటర్ స్పష్టం చేసి వార్తను ప్రసారం చేశారు.

ఆ వెంటనే బాబా రాందేవ్ సంస్ధల ఉత్పత్తుల “పతంజలి” యాడ్స్ నిలచిపోయాయి. ఆ ఇరువురినీ తొలగిస్తేనే ఆ గ్రూ50 కోట్ల రూపాయల యాడ్ కాంపెయిన్ కొనసాగుతుందన్న సందేశం అందడంతో సీనియర్ స్ధాయిలో వున్న ఈ ఇద్దరితో యాజమాన్యం రాజీనామా చేయించింది. పుణ్యప్రసూన్‌ బాజ్‌పేయి ఇదంతా వెల్లడించారు. 

ఇందులో మోదీ కార్యాలయం వత్తిడిలేదు. అరిషడ్వర్గాలను జయించలేని బాబా రామ్ దేవ్ సంస్ధల ప్రమేయం వుంది. “మా యాడ్ మా ఇష్టం” అనే సంస్ధ ప్రతినిధుల స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు. ఉద్దేశాలు మాత్రం స్పష్టంగానే వున్నాయి. మోదీ మీద మాట పడకుండా కాపుకాచే కార్పొరేట్లు వున్నాయి. ఆనందబజార్ గ్రూప్ ని కూడా  ఓ యాభై కోట్ల యాడ్ తో కొట్టొచ్చు అనే వ్యాపారనీతి వుంది 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here