19వ డివిజన్‌లో అన్నదానం

0
207
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 14 : స్ధానిక 19వ డివిజన్‌  ఆల్కాట్‌తోటలోని అంట్యాకుల వారి వీధిలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్‌ సర్కిల్‌, డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ గొందేశి మాధవిలత, హరనాధ్‌ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని గొందేశి మాధవిలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here