2న రాష్ట్ర దేవాంగ సంఘం మహాసభ

0
380
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన నేపధ్యంలో 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేక దేవాంగ సంఘాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వచ్చే నెల 2న ఉదయం 10.30 గంటలకు జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి కల్యాణ  మండపంలో 13 జిల్లాల దేవాంగ సంఘ ప్రతినిధులతో ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సన్నాహక కమిటీ కన్వీనర్‌, నగర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాలెపు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఆశపు రామలింగేశ్వరరావు, హిందూపురం పార్లమెంట్‌ సభ్యులు నిమ్మల కిష్టప్ప హాజరవుతారు. సభకు నగర దేవాంగ సంఘం అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్‌ అద్యక్షత వహిస్తారు. కార్పొరేటర్‌ ద్వారా పార్వతి సుందరి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మాజీ ఎమ్మెల్యే చందన రమేష్‌, 13 జిల్లాలకు చెందిన దేవాంగ ప్రతినిధులు హాజరవుతారు.