23వ డివిజన్‌లో ముగ్గుల పోటీలు

0
56
రాజమహేంద్రవరం, జనవరి 13 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక 23వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యిన్నమూరి దీపు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, మాజీ కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు పాల్గొని ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధమ బహుమతిగా టివి, ద్వితీయ బహుమతిగా గ్రైండర్‌, తృతీయ బహుమతిగా మిక్సీ, కన్సోలేషన్‌ బహుమతులు, పార్టిసిపేషన్‌ బహుమతులు అందజేశారు.ఈ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వాసు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here