26న లయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ పర్యటన

0
102

రాజమహేంద్రవరం, జనవరి 25 : అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ డిఎస్‌ఎస్‌వి వర్మ ఈ నెల 26న నగరంలో పర్యటించనున్నారని లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవరం అధ్యక్షులు గుబ్బల రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ రాజమహేంద్రవరం స్థాపించి 54 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని 55 విభాగాల్లో సేవా కార్యక్రమాలు రూపొందించామని, దీనిలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, రక్షిత మంచినీటి పథకాలు, వికలాంగులు, వృద్ధులకు ఉపకరణాలు, స్త్రీలకు కుట్టుమిషన్లు, పార్కుల అభివృద్ధి, తదితర సేవా కార్యక్రమాలు గవర్నర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలో సేవలందిస్తున్న ఇద్దరు ప్రముఖులకు లయన్స్‌ సేవా పురస్కారం గవర్నర్‌ చేతుల మీదుగా అందిస్తామన్నారు. స్థానిక స్వర్ణాంధ్ర సేవా సంస్థలో జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కార్యదర్శి తుమ్మిడి అరుణ్‌కుమార్‌ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథి వెంకటేశ్వరరావు, కోశాధికారి కొత్త బాలమురళి, నేరెళ్ల జయశ్రీ, చిర్రావురి శివప్రసాద్‌, ఎస్‌వివి సత్యనారాయణ పాల్గొంటారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here