28 నుంచి శివ కామేశ్వరి పీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

0
112
ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన దక్షిణామూర్తి సిద్ధాంతి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 27 :  ఏ వి అప్పారావు రోడ్డులోని జయశ్రీ గార్డెన్‌ మొదటి వీధిలో ఉన్న శివ కామేశ్వరి పీఠంలో  శ్రీ శ్రీ శ్రీ  శివ కామేశ్వరి పీఠం 28 వ శరన్నవరాత్రి  వేడుకలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా శివ కామేశ్వరి పీఠం శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు  పీఠాధిపతి బ్రహ్మశ్రీ  ఈమని దక్షిణామూర్తి సిద్ధాంతి చెప్పారు. తాతారావు, జి సుబ్రహ్మణ్యం,బి శ్రీనివాస్‌,వైజి రాజులతో కల్సి ఈ ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందల ఏళ్లనాటి  శివ కామేశ్వరి పీఠం తమ పెదనాన్న హయాంలోకి వచ్చి 28ఏళ్ళు పూర్తయిందని,ప్రతియేటా విశేష పూజలతో ఇక్కడ శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామని చెప్పారు.  గ్రహ తాత్రికంగా గ్రామ, రాష్ట్ర,దేశ క్షేమం కోసం, లోకం సుభిక్షంగా, సౌభాగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో విశేష పూజలు జరుగుతాయన్నారు.   జక్కంపూడి విజయలక్ష్మి, కోళ్ళ అచ్యుతరామారావు ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవాలు ఈనెల 29 న ఉదయం 6.39 నిమిషాలకు కలశస్థాపనతో  శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.  ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ అన్నదానం,తీర్ధ ప్రసాదాలు ఉంటాయని చెప్పారు.  29న ఆదివారం ఉదయం 8 గంటలకు లక్ష్మీ గణపతి పూజ, హోమం అలాగే నవగ్రహ మండపారాధన,చంద్ర గ్రహమండపారాధన, బుధాదిత్య గ్రహ మండపారాధన నిర్వహిస్తారు.30వ తేదీన చంద్రగ్రహ మండపారాధన, సుహాసిని లచే కుంకుమార్చన,వస్త్రాలంకరణ, అక్టోబర్‌ 1వ తేదీన కుజ గ్రహ మండపారాధన కుంకుమార్చన,వస్త్రాలంకరణ రెండో తేదీన నవగ్రహ మండపారాధన, సుహాసిని లచే కుంకుమార్చన,వస్త్రాలంకరణ జరుపుతారు. 3 న గురు గ్రహ మండపారాధన, 4న శుక్రగ్రహం మండపారాధన, 5న నవగ్రహ మండపారాధన, అష్ట భైరవ ఆరాధన, నందీశ్వర సమేత కామేశ్వరి కొలువు,సరస్వతీ పూజ, వస్త్రాలంకరణ జరుగును.6న నవగ్రహ మండపారాధన, నవధాన్య దానములు వీరభద్రుని సంబరం శ్రీ శ్రీ శ్రీ కామేశ్వరి కొలువు ఉంటుంది. 7న శ్రీ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన,జ్యోతిర్లింగార్చన, నవ చండీ పారాయణ, చండీ హోమం, బాల, సుహాసిని, కౌమారి వ్రతం. పూర్ణాహుతి దంపతుల పూజ, 8న పూర్ణకుంభ పూజ, గోదానము, అన్నదానం నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here