29న విద్యా సంస్ధల బంద్‌ 

0
230
విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటన
రాజమహేంద్రవరం,ఆగష్టు 27 : విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 29 న రాష్ట్ర వ్యాప్తంగా కెజి నుండి పిజి వరకు విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి సంఘాల ఐక్య కారాచరణ కమిటి ప్రతినిధులు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌.ఎఫ్‌.ఐ. నాయకులు ఒవన్‌, పి.డి.ఎస్‌.యు.నాయకులు కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం కూడా విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ బకాయిలు విడుదల చేయాలని, జూనియర్‌ కళాశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పధకం కొనసాగించాలని,విద్యా హక్కు చట్ట ప్రకారం 25 శాతం సీట్లు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచితంగా ఇవ్వాలని, అక్షయపాత్ర సంస్థను రద్దు చేసి ఏజెన్సీల ద్వారానే మధ్యాహ్న భోజనం కొనసాగించాలని,యూనివర్శిటీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయాలని,ప్రభుత్వ డిగ్రీ,ఇంటర్‌ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని,నూతన డిఎస్సీ విడుదల చేసి టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు.అన్ని ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ కమిటి వేయాలని,జాతీయ వైద్య మండలిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాల ఐక్య కారాచరణ కమిటి (ఎస్‌.ఎఫ్‌.ఐ, పి.డి.ఎస్‌.యు, ఎఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో 29న చేస్తున్న బంద్‌ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో ఎన్‌.రాజా,ఐ.చంద్రశేఖర్‌,లక్ష్మణ్‌ రెడ్డి, కె.అఖిల్‌, సతీష్‌, అశోక్‌ కుమార్‌, సాయి,సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here