3న భారత న్యాయవాదుల సంఘం జిల్లా మహాసభ

0
364
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : భారత న్యాయవాదుల సంఘం జిల్లా మహాసభను ఈనెల 3వ తేదీన వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది  ముప్పాళ్ళ సుబ్బారావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభకు హైకోర్టు న్యాయమూర్తులు రాజా ఎలాంగో, సి.ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిధులుగా హాజరవుతున్నారని, అతిథులుగా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, జిల్లా జడ్జి బి.ఎస్‌.భానుమతి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు గంటా రామారావు ప్రత్యేకాహ్వానితులుగా బొమ్మగని ప్రభాకర్‌, చలసాని అజయ్‌కుమార్‌, బి.గోకుల్‌ కృష్ణ, పి.ఏ.చౌదరి, కె.ఎస్‌.సురేష్‌కుమార్‌, జి.జగదీశ్వర్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభలో ‘దేశంలో మానవహక్కుల అమలు’ అంశంపై సదస్సు జరుగుతుందన్నారు. మహాసభ ముగిసిన తరువాత జిల్లా, నగర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద వృత్తిలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎం.వి.నాగలింగేశ్వరరావు, ఎ.వెంకటపతిరాజు, కాశి శ్రీనివాసరావు, డాక్టర్‌ జి.అజయ్‌రతన్‌, దాసరి అమ్ములు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.