3న శబరిమలైకు ప్రత్యేక బస్సు

0
284
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం వెళ్ళే భక్తుల కోసం ఈ నెల 3న రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ టి.పెద్దిరాజు తెలిపారు. ఐదు రోజులు సాగే ఈ యాత్ర టిక్కెట్‌ రూ. 3,800గా నిర్ణయించారు. సూపర్‌ లగ్జరీ, 36 ఫుష్‌బ్యాక్‌ సీట్స్‌, ఎయిర్‌ సస స్పెన్షన్‌ కలిగిన ప్రత్యేక వీడియో కోచ్‌ బస్సును భక్తుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర సిరిపురం, కాణిపాకం, ఎరుమేలి, పంబ, తిరుపతి, విజయవాడ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఈ యాత్ర ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 73829 11410, 73829 11532 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు.