32వ డివిజన్‌లో కొత్త పింఛన్లు పంపిణీ

0
194

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 5 : స్థానిక 32వ డివిజన్‌లో కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు డివిజన్‌ కార్పొరేటర్‌ ద్వారా పార్వతి సుందరి ఈరోజు పంపిణీ చేశారు. డివిజన్‌కు 22 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, ఎన్టీఆర్‌ భరోసా పథకంలో 42 పింఛన్ల కోసం దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. ఏడుగురికి స్మార్ట్‌ సర్వే పూర్తయ్యాక వచ్చేనెల నుంచి పింఛన్లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. వృద్ధాప్య, వికలాంగ పింఛనుదారులు ఎంతమంది ఉన్నా మంజూరు చేస్తూ వితంతువులకు మాత్రం 52 సంవత్సరాల షరతు వల్ల కొంతమంది అర్హులైన వారికి నష్టం కలుగుతుందని ఈ విషయాన్ని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన మాట్లాడి పెండింగ్‌లో ఉన్న పింఛన్లకు మోక్షం కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి కమిటీ సభ్యులు చప్పటి సత్యనారాయణ, దుర్యోధన మహంతి, దండా సత్యవతి, అఫీజ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here