32వ డివిజన్‌ ఆదిరెడ్డి ప్రచారం

0
228
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 8 : రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ నగరంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌ ద్వారా పార్వతి సుందరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో భవాని పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లుగా తెలుగుదేశ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాశి నవీన్‌కుమార్‌, కడితి జోగారావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here