4నుంచి వడ్డీ పోలమాంబ, కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవం

0
322
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 :  స్ధానిక అశోక్‌నగర్‌ రెల్లీపేటలో  శ్రీ వడ్డీ పోలమాంబ, కుంచమాంబ అమ్మవార్ల  101 జాతర మహోత్సవాలను  వచ్చే నెల 4 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లం పోలయ్య ప్రెస్‌క్లబ్‌లో  ఈరోజు విలేకరులకు  తెలిపారు. గత వందేళ్ళుగా మూడు సంవత్సరాలకో పర్యాయం ఈ జాతరను ఐదు వారాల పాటు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 101 సంవత్సరంగా  ఈ ఉత్సవాలను  ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజు అమ్మవార్లకు నిత్య పూజా కార్యక్రమాలు, ప్రతి వారం బోణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రెల్లి కులస్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్సవాలు అశోక్‌నగర్‌, రెల్లిపేట, తాడితోటల్లో జరుపుతారని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో ముత్యాల రాము, ముత్యాల రాజు, ముత్యాల వెంకటరమణ, బి.వి.వి. రమణ, చెన్నా వీరభద్రరావు పాల్గొన్నారు.