4న  రాజమహేంద్రి మహిళా కాలేజీ రజతోత్సవం

0
316
పూర్వపు ప్రిన్సిపాల్స్‌కి సత్కారం – ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులకు సన్మానం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 1 : విస్తరిస్తున్న నగరానికి అప్పట్లో కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల ఒక్కటే ఉన్న నేపథ్యంలో మరో కళాశాల అవసరాన్ని గుర్తించిన విశ్రాంత పేపర్‌మిల్లు అధికారి టికె విశ్వేశ్వర రెడ్డి సారథ్యంలో 1993లో ఆవిర్భవించిన రాజమహేంద్రి మహిళా కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈసందర్బంగా రజతోత్సవ వేడుకలు, ఫ్రెషర్స్‌ డే వేడుకలు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సెప్టెంబర్‌ 4వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రిన్సిపాల్‌ సత్య సౌందర్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ,కంప్యూటర్‌ డిపార్ట్‌ మెంట్‌ హెడ్‌ ప్రసాద్‌ లతో కల్సి ఈ ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌  టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల ప్రారంభంలో 75మంది విద్యార్థినిలు ఉండగా, ఇప్పుడు 14 వందలమంది వున్నారని చెప్పారు. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో 236కాలేజీలు ఉండగా సంఖ్యా  పరంగా తమ కళాశాల 8వ స్థానంలోనూ, ఉపాధి కల్పనలో మొదటి స్థానంలోనూ ఉందని వివరించారు. ఇది యూనివర్సిటీ పరిధిలో రికార్డుగా పేర్కొన్నారు. కళాశాలలో చేరాక, డిగ్రీ పూరయ్యే సరికి జాబ్‌ తో బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని, 226మంది డిగ్రీ చదివితే అందులో 186మాది ఉద్యోగాలు పొందారని ఆయన చెప్పారు. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే ఉద్యోగానికి సంబంధించిన అంశాలలో శిక్షణ ఇస్తున్నామని ఆయన గుర్తుచేశారు. 4న జరిగే కార్యక్రమానికి కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కర్రి రామారెడ్డి అధ్యక్షత వహిస్తారని, నన్నయ్య యూనివర్సిటీ విసి ప్రొఫెసర్‌ ఎం ముత్యాల నాయుడు ముఖ్య అతిథిగా,మేయర్‌ పంతం రజనీ శేషసాయి గౌరవ అతిధిగా, కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ (మేజరు) చల్లా సత్యవాణి గౌరవ వక్తగా పాల్గొంటారని   విశ్వేశ్వర రెడ్డి చెప్పారు.  కళాశాల రజతోత్సవం సందర్బంగా ఇప్పటివరకూ పనిచేసిన ప్రిన్సిపాల్స్‌కి సత్కారం చేస్తామని,అలాగే ,ఉన్నత స్థాయికి చేరిన విద్యార్థులకు, మంచి శిక్షణ ఇచ్చిన అధ్యాపకులకు సత్కారం చేస్తామని ఆయన వివరించారు.
నవంబర్‌లో అంతర్జాతీయ స్కూల్‌ సిద్ధం  ప్రారంభం
కేజీ నుంచి పిజి వరకూ విద్యా సంస్థ  ఉండాలన్న సంకల్పంతో కళాశాల ప్రారంభించామని,అయితే వివిధ కారణాల  వలన కేజీ స్థాయికి విస్తరించలేక పోయామని విశ్వేశ్వర రెడ్డి చెబుతూ ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో సెంట్రల్‌ సిలబస్‌ తో గురుకుల విద్య,ఆధునిక విద్య జోడించి రాజమహేంద్రి ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ నవంబర్‌లో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బొమ్మూరు కేశవరం రోడ్డులో 12 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం పూర్తయిందని, నవంబర్‌ 2న భవనాలకు ప్రారంభోత్సవం చేసి, ఆతర్వాత తరగతులు ప్రారంభిస్తామని సూచించారు. పేపర్‌ తో పని లేకుండా అంతా అంతర్జాలం,పెన్‌ డ్రైవ్‌,ఇమెయిల్‌ ద్వారా నే విద్యా ప్రణాళిక ఉంటుందని, ప్రాణాయామం, ధ్యానం, క్రీడలు, కళలు ఇలా అన్నింటా తర్ఫీదు ఉంటుందని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here