4వ తరగతి విద్యార్ధినికి భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహాయం

0
253

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 3 : స్థానిక నలంద స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న ఆకుల కీర్తనదేవి అనే పేద విద్యార్ధినికి భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు ఆర్థిక సహాయం అందజేశారు. ఫీజు నిమిత్తం ఈ సహాయం అందజేశామని, ప్రతిభ కలిగి పేదరికం అడ్డుగా ఉండే విద్యార్ధులకు తమ ట్రస్ట్‌ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యవంతమైన సమాజం కోసం మెగా మెడికల్‌ క్యాంప్‌ను కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ బొమ్మనమైన శ్రీను, తురకల నిర్మల, గోవిందరాజు, ముమ్మిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here