43వ డివిజన్‌లో పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు ఆదిరెడ్డి శంకుస్థాపన

0
174

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16 : అభివృధ్ది, సంక్షేమం లక్ష్యాలుగా పని చేస్తున్న సిఎం చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని శాసనమండలి సభ్యులు అదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 43వ డివిజన్‌లో పైప్‌లైన్‌ నిర్మాణానికి ఆదిరెడ్డి శంకుస్ధాపన చేశారు. ముందుగా అక్కడ ఉన్న ఎన్‌.టి.ఆర్‌. విగ్రహానికి ఆదిరెడ్డి, స్ధానిక కార్పొరేటర్‌ కంటిపూడి పద్మావతి, తెదేపా యువనాయకులు ఆదిరెడ్డి వాసు, కంటిపూడి శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పైప్‌లైన్‌ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృధ్ధే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎస్సీ సెల్‌ నాయకులు కడితి జోగారావు, స్ధానిక నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు కాంట్రాక్టర్‌ వేముల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here