45వ డివిజన్‌ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన

0
114
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 4 : స్థానిక 45వ డివిజన్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఈరోజు పర్యటించారు. డివిజన్లలో రాజీవ్‌ గాంధీ నగర్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు నగర పాలక సంస్థ నుంచి సూపర్‌ టాక్స్‌ వేయించి వ్యక్తిగత మంచి కుళాయిలు వేయించుకునేల చేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే భవానీ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆర్‌ అండ్‌ బి స్థలంలోని వాంబే గృహాలు, వాటి సమీపంలోని డంపింగ్‌ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవానీ మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ నగర్లోని కుటుంబాలకు సూపర్‌ టాక్స్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే రత్నంపేటలోని వాంబే గృహాల వద్ద శానిటేషన్‌ సక్రమంగా నిర్వహించాలని, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంబాలను తొలగించి అవసరమైన చోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. వీధి దీపాలు వెలిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం 49వ డివిజన్‌ లో పర్యటించారు. ఆ డివిజన్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం-1 కు ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న కల్వర్ట్‌ను చూసారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే సమయంలో సచివాలయం గోడ కింద నుంచి మట్టిని తొలిచేస్తుండడంతో అందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు) మాట్లాడుతూ స్థానికులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు.  కొయ్యల రమణ, బాలు, నర్సీ, సుగుణ, స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ ఈఈ, డిఈ, ఏఈలు, ఎలక్ట్రికల్‌ ఏఈ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here