50 శాతం వలంటీర్లు బీసీలకు ఇవ్వాలి

0
96
బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల
రాజమహేంద్రవరం, ఆగస్టు 21 :  రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న వలంటీర్లలో 50 శాతం వాటి బీసీ యువతీ,యువకులకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు డిమాండ్‌ చేసారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు కనీసం గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెదేపా నాయకులు చెప్పివారికే ఇళ్లు, పింఛన్లు ఇచ్చారని బీసీ నాయకులు చెప్పిన వారిని పూర్తిగా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాపులకు పెద్దపీట వేసి బీసీలను పక్కన పెట్టడం వల్లనే తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి పాలైందన్నారు. 135 బీసీ కులాల నాయకులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బానిసల్లా చూసారని, ఎన్నో అవమానాలు భరిస్తూ ఆ పార్టీలో బీసీ నాయకులు పనిచేసారని ఆవేదన వ్యక్తం చేసారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే 2019 ఎన్నికల్లో బీసీ కులాలకు చెందిన ఓట్లన్నీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వేసారన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో తనను వేదిక మీదకు కూడా పిలవలేదని దాన్ని అవమానంగా భావించానన్నారు. అందువల్లనే టీడీపీ రాష్ట్రంలో అడ్రస్‌ లేకుండా పోయిందని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ బీసీలకు పెద్దపీట వేస్తున్నారని, ఏ పార్టీ ఇవ్వనన్నీ మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారన్నారు.  ఉద్యోగాల్లో బీసీ, ఇ బీసీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. చట్టసభల్లో 50 శాతం సీట్లు బీసీలకు వచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here