6న జక్కంపూడి జయంతి కార్యక్రమాలు                       

0
316
రాజమహేంద్రవరం, ఆగస్టు 3 : జనయోధుడు, కార్మిక నేత, మాజీమంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా ఈ నెల 6వ తేదీన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు 4వ డివిజన్‌ కార్పొరేటర్‌, జక్కంపూడి అభిమాని బొంతా శ్రీహరి వెల్లడించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ జక్కంపూడి జిల్లాకు ఎనలేని సేవలు అందించారన్నారు. రైల్‌ కం రోడ్డు బ్రిడ్జి పై భారం తగ్గించేందుకు గోదావరి నదిపై నాల్గవ బ్రిడ్జి నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానించడంతో పాటుగా విశాఖపట్నంకు దూరాన్ని తగ్గించారన్నారు. జక్కంపూడి సేవలను జిల్లా ప్రజలు మరువరన్నారు. జిల్లా వ్యాప్తంగా జక్కంపూడి జయంతి, వర్ధంతులను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. జయంతి సందర్భంగా 6న కంబాలచెరువు జక్కంపూడి చౌక్‌ వద్ద ఉదయం 9.30 గంటలకు జక్కంపూడి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో అన్ని విభాగాల్లోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే గౌతమి జీవకారణ్య సంఘం వ ద్ధులకు పండ్లు, రొట్టెలు అందజేస్తామన్నారు. అలాగే జియోన్‌, ప్రియదర్శిని స్కూల్లో సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్‌, వైసిపి నగర కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, గ్రేటర్‌ అధ్యక్షులు కందుల దుర్గేష్‌, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాజానగరం, కడియంలో కూడా పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. విలేకర్ల సమావేశంలో బుద్దాల రాజు, ఆవాల ఈశ్వర్‌, దొడ్డి రాజేష్‌, కేతా జ్యోతి స్చరూప్‌, శివ, సందీప్‌ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here