60 శాతం అభివృద్ధి జరిగితే అనుమతులు షురూ

0
295
అనధికార లే అవుట్ల బాధితులకు ప్రభుత్వం ఊరట
రాజమహేంద్రవరం, ఆగస్టు 17 : లే అవుట్లలో 60 శాతం భవన నిర్మాణాలు జరిగి పంచాయితీ లేదా మున్సిపాలిటీ రోడ్లతోపాటు మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఏరియాలో ఇలాంటి సమస్యతో ఎనిమిదిమంది దరఖాస్తు చేసుకున్నారని, వారు గుడా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించి అనుమతులు పొందవచ్చని ఆయన సూచించారు. ఇదే తరహాలో భవన నిర్మాణాలు చేపట్టదలచినవారు ప్రభుత్వ నిర్ధేశిత సూత్రాల ప్రకారం దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా అనుమతులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ అంశాలను గతంలో మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ దృష్టికి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్ళగా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here