8న గౌడ, శెట్టిబలిజ ఉచిత వివాహ పరిచయ  వేదిక

0
304
రాజమహేంద్రవరం, జూన్‌ 20 : గౌడ,శెట్టిబలిజ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూలై 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి స్ధానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీశయన, ఈడిగ, యాత యువతీయువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వస్తున్నట్లు సంఘం వ్యవస్ధాపకులు సానబోయిన రామారావు, అధ్యక్షులు మట్టా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గెద్దాడ హరిబాబులు వెల్లడించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పె ౖసంఘీయులలో వివాహం కావాల్సిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్డు సైజ్‌ ఫొొటో, పుట్టినతేదీ, నక్షత్రం,ఎత్తు వివరాలతో బయోడేటాలతో ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరారు. యువతి, యువకులను పరిచయం చేయడం జరుగుతుందన్నారు. పిల్లల వివాహ సంబంధాలు విషయంలో సంఘీయులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత కొద్ది సంవత్సరాలుగా తమ సంఘం ద్వారా ఉచిత వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తూ, తమ తోడ్పాటును అందిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 9247864443 నెంబర్‌ నందు సంప్రదించవచ్చును. విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షులు కుడిపూడి నాగప్రభాకరరావు, చింతపల్లి అన్నవరం సత్యనారాయణ, గౌరవ సభ్యులు మట్టపర్తి సత్యనారాయణలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here