8న భీమవరంలో ప్రజాశాంతి సభ

0
161
కెఎ పాల్‌ రాక : హిప్నో కమలాకర్‌ వెల్లడి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 6 : ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్‌ 8న  సాయంత్రం 5 గంటలకు భీమవరం లూథరన్‌ హైస్కూల్‌లో జరిగే మహాసభకు హాజరవుతున్నట్టు హిప్నో కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రజలు అభద్రత, అశాంతితో రగిలిపోతున్నారని వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి తమపార్టీ చేపట్టే కార్యాచరణను ఆ బహిరంగ సభలో వెల్లడిస్తామన్నారు. భావసారూప్యత కలిగిన విద్యావంతులు ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ సహా తెలంగాణాలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా పోటీ పెడతామన్నారు. ప్రాంతీయ, కుల, మత, వర్గ వైషమ్యాలకు తావులేని సమ సమాజ స్థాపనే లక్ష్యంగా తమ పార్టీ ముందడుగు వేస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here