8న మార్గాని, ఆదిరెడ్డిలకు సత్కారం

0
117
బీసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నరవ
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 5 : సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన బిసి సామాజిక వర్గానికి చెందిన రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌రామ్‌, సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలను బిసి సంక్షేమ సంఘం తరపున ఈ నెల 8 న హోటల్‌ ఆనంద్‌ రీజెన్సీలో సత్కరిస్తున్నట్లు సంఘ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నరవ గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక విఎల్‌ పురంలోని నరవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 8న జరిగే సత్కారోత్సవానికి నగరంలోని అన్ని బిసి కులాల వారు హాజరు కావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఈ సత్కారం జరుగుతుందని, ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు విఎల్‌ పురం సెంటర్‌ నుంచి ర్యాలీగా తాడితోట, బైపాస్‌ రోడ్డు, నందం గనిరాజు జంక్షన్‌ మీదుగా ఆనంద్‌ రీజెన్సీకి చేరుకుంటామన్నారు. ఈ సత్కార సభలో బిసి వన సమారాధన కార్యక్రమం పై చర్చిస్తామన్నారు. బిసి ప్రజాప్రతినిధులకు సమస్యలు తెలియజేసి వారి ద్వారా పరిష్కరించాలన్నదే తమ ధ్యేయమన్నారు. నగరంలో ఉన్న 28 బిసి కులాల ప్రతినిధులను ఒకే వేదికపై తీసుకు వస్తామన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు విస్తృతంగా కమిటీలను నియమిస్తున్నామని నరవ వెల్లడించారు. జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి అప్పారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిగే ఈ సత్కారోత్సవానికి బీసీలందరూ ఐక్యంగా తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో  గ్రేటర్‌ అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షుడు గోలి రవి, రూరల్‌ అధ్యక్షుడు బిల్డర్‌ బాబి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌, గ్రేటర్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మీ, రాష్ట్ర నాయకులు మీసాల గోవింద్‌, సప్పా ఆదినారాయణ, నాయకులు గేడి అన్నపూర్ణ రాజు, రుక్మాంగధరరావు, పసలపూడి భద్రం, పీతా రామకృష్ణ, ముంతా సుమతి, వినయకుమారి, నందం స్వామి, రాజేష్‌, కసిరెడ్డి కామేష్‌  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here