9న తిరుమలకు ప్రధాని మోడీ 

0
162
న్యూఢిల్లీ, జూన్‌ 1 : ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ తిరుమల శ్రీవారి దర్శనార్థం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. భాజపా శ్రేణులు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన  సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here