ప్రముఖులను కలిసిన పొడుగు శ్రీను

0
27
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 26 : తెలంగాణా అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్యలను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొడుగు శ్రీను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీకి వెళ్ళి  తెలంగాణా స్పీకర్‌ను కలిసి ఆయన  చిత్రపటాన్ని బహూకరించారు. ఎంతో దూరం నుంచి వచ్చి తన చిత్రపటాన్ని తనకు బహూకరించడం పట్ల  పొడుగు శ్రీనును స్పీకర్‌ మధుసూధనాచారి అభినందించారు. అనంతరం ఆర్‌.కృష్ణయ్య నివాసానికి వెళ్ళి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలను ప్రస్తావించారు. సంఘాన్ని బలోపేతం చేయాలని, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘం ప్రత్యామ్నాయ శక్తిగా ఉండేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here