ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ

0
38
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 27 : స్థానిక రాజేంద్రనగర్‌లో ఇటీవల నిర్వహించిన మెగా మెడికల్‌ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన కళ్ళజోళ్ళను భవానీ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత ఆదిరెడ్డి వాసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీదైన కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని అందిస్తున్నారని, ఈ శిబిరాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ ప్రజా సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు మేరపురెడ్డి రామకృష్ణ, నక్కా దేవీవరప్రసాద్‌, చల్లా కేశవ్‌, నాగబాబు, యాళ్ళ రవికుమార్‌, మెరపల శివ, రామకృష్ణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here