అగ్ని ప్రమాద బాధితులకు వంట సామాగ్రి పంపిణీ

0
33
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 27 : స్థానిక 3వ డివిజన్‌ నెహ్రూనగర్‌లో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన ఐదు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు వంట సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గృహపథకం ద్వారా ఇళ్ళ నిర్మాణానికి రూ.3లక్షల 50వేలు ఇవ్వడం జరుగుతుందని, దానిలో రూ.2.50 లక్షలు సబ్సిడీగా అందిస్తుందన్నారు. రూ.75వేలు బ్యాంక్‌ ద్వారా రుణాన్ని అందిస్తుందని, లబ్ధిదారుని వాటాగా రూ.25వేలు చెల్లిస్తే సరిపోతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని పక్కా గృహాలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుడిపూడి సత్తిబాబు, బొమ్మనమైన శ్రీను, జక్కంపూడి అర్జున్‌, టేకుమూడి నాగేశ్వరరావు, మేరపురెడ్డి రామకృష్ణ, అట్టాడ రవి, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here