5,6 తేదీలలో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా

0
48

ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ

రాజమహేంద్రవరం, జనవరి 3 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర యస్‌.సి,యస్‌.టి కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజి తెలిపారు. స్దానిక రోడ్లు, భవనాల శాఖ అతిధి గృహాంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా షెడ్యులు కులాలు,షెడ్యుల తెగల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్యోగమేళా జిల్లాలో ఈ నెల 5,6తేదీలలో ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 5వతేది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో, 6వతేది అమలాపురం ప్రసిద్ద ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల నుండి నిరుద్యోగ యువత పాల్గోనవచ్చునని అన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటుచేసిన ప్రాంతంలో పరిశ్రమల స్దాపనకు అవసరమయ్యే విషయాలను కూడా విద్యార్దులకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఎంపిక అయిన వారికి అయా సంస్దల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంస్దలలో కాకుండా ప్రయివేటు సంస్దలలో కూడా అర్హత కలిగిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్బంగా జిల్లా వికాస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.యన్‌.రావు మాట్లాడుతూ 5,6 తేదిలలో సూమారు 40 సంస్దలు హాజరు కానున్నాయని, ఎంపికకు 10వ తరగతి నుండి పి.జి వరకు పాల్గోనవచ్చునని, ఆయా అర్హతలను బట్టి ఎంపిక పక్రియ జరుగుతుందని అన్నారు. 5వతేదిన వేయి మందిని, 6వతేదిన వేయి మందిని ఆయా సంస్దల ద్వారా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటాయని తెలిపారు. అభ్యర్ధులు విద్య అర్హతలు, కుల ధృవీకరణ,బయోడేటా, ఫోటోలతో హాజరుకావాలని అన్నారు. కమిషన్‌ కార్యాలయం డిప్యూటి డైరెక్టర్‌ వి.నాన్‌రాజు మాట్లాడుతూ ఉద్యోగమేళకు హాజరు అయ్యే అభ్యర్దులకు మధ్యాహ్నా భోజనం, జాబ్‌ మేళ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వాల్మీకి యూత్‌ అధ్యక్షుడు దూడ స్మీత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బోరగ త్రిత్వకుమార్‌,ప్రధాన కార్యదర్శి గోర్లె పెన్సిన్‌ బాబు, మెంబర్‌ చిన్నం సందీప్‌ చైర్మన్‌ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై.అప్పారావు, అజ్జవరపు వాసు, తాళ్ళురి బాబు రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజివి, కప్పాల వెలుగుకుమారి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here