ఆజాద్‌ చౌక్‌లో అలజడి

0
113

మశీదు మౌజన్‌ ఇంటి కర్టెన్‌కు నిప్పంటించిన దుండగులు

సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, జనవరి 4 : బత్తిననగర్‌ మశీదు మౌజన్‌ హత్యకేసుతో అట్టడుకిన నగరంలో కొంతమంది ఆకతాయిలు అలజడి రేపుతున్నారు. అజాద్‌ చౌక్‌ సెంటర్‌లో ఉన్న మశీదుకు చెందిన ఇమామ్‌ నివాసానికి చెందిన కర్టెన్‌కు గత అర్థరాత్రి దుండగులు నిప్పంటించారు. ఈరోజు ఉదయం ఈ విషయం బయటకు రావడంతో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది కావాలనే అలజడులు సృష్టిస్తున్నారని, ఇలాంటి సమయంలో అందరూ సంయమనం పాటించాలన్నారు. ఇలాంటి కుట్రలు చేసే అసాంఘికశక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరిపి నేరస్తులను అదుపులోకి తీసుకుని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here