అరాచకశక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి

0
34

మౌజన్‌ హత్యకేసును ప్రభుత్వం మూడురోజుల్లో ఛేధించింది

శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు రాజీపడరు : జన్మభూమిలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ

రాజమహేంద్రవరం, జనవరి 4 : బత్తిననగర్‌ మశీదులో మౌజన్‌ హత్యకేసును సీరియస్‌గా తీసుకుని మూడురోజుల్లో నిందితుడిని అరెస్ట్‌ చేసిందని, సమాజంలో అరాచకశక్తుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. ఈరోజు 32, 30, 25, 23, 31, 29, 24 డివిజన్‌లో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో సీఎం చంద్రబాబునాయుడు ఎక్కడా రాజీపడటంలేదని, మౌజన్‌ హత్యకేసు విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారని, రాజమండ్రి అర్బన్‌ పోలీసులు ఈ కేసును మూడురోజుల్లో చేధించగలిగారన్నారు. హత్య జరిగిన తరువాత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్షాల నోటికి తాళం వేసినట్లుగా ప్రభుత్వం త్వరితగతిన నిందితుడిని అదుపులోకి తీసుకుందన్నారు. రాష్ట్రంలో కొంతమంది అరాచకశక్తులుగా మారి అలజడులు సృష్టిస్తున్నారని, దీని పట్ల అందరూ అప్రమత్తంగా ఉండి వారికి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలను ప్రవేశపెడుతుందని, వాటిని అర్హులైన వారికి అందించాలన్న సంకల్పంతోనే జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పలు డివిజన్‌లలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి మేయర్‌ రజనీ శేషసాయి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను, చంద్రన్న సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్లు ద్వారా పార్వతిసుందరి, పైడిమళ్ళ మెర్సీప్రియ, కురగంటి ఈశ్వరి, యిన్నమూరి రాంబాబు, మజ్జి నూకరత్నం, కురిమిల్లి అనూరాధ, బెజవాడ రాజ్‌కుమార్‌, నాయకులు ఆదిరెడ్డి వాసు, రెడ్డి మణి, కురగంటి సతీష్‌, మజ్జి అప్పారావు, ఉప్పులూరి జానకిరామయ్య, వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, మజ్జి పద్మ, తహశీల్దార్‌ రాజేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here