అభివృద్ధి విషయాల్లో రాజకీయాలా ?

0
71

42 వ డివిజన్‌ జన్మభూమిలో గుడా చైర్మన్‌ ధ్వజం

గ్రామ సభలో వేదిక దిగువనే కూర్చున్న గన్ని కృష్ణ

ఎట్టకేలకు మున్సిపల్‌ కాలనీ గ్రౌండ్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాజమహేంద్రవరం, జనవరి 6 : స్ధానిక 42వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి సభలో గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలకుల తీరును నిరసిస్తూ వేదికపై ఆశీనులు కాకుండా ప్రజలతో కలిసి కూర్చొన్నారు. గత ఏడాది జన్మభూమిలో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా మార్కెట్‌ యార్డులో రైతు బజార్‌, మునిసిపల్‌ కాలనీ గ్రౌండ్‌కు ప్రహరీ గోడ నిర్మించి, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించి కౌన్సిల్‌లో తీర్మానించి, టెండర్లు పిలిచి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంపై గన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పనులు ప్రారంభించడానికి కొబ్బరికాయలు దొరకడం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఇదే పద్దతిలో రత్నంపేట వాంబే గ హాల వద్ద ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో వ్యవహరించారని మండిపడ్డారు.టెండర్లు ఖరారు చేసి అగ్రిమెంట్‌ పూర్తి చేసుకొని పనులు ప్రారంభించకపోవడంతో అసహనం వ్యక్తం చేసారు. అభివ ద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అయితే ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు వేదికపైకి రావాలని కోరినప్పటికీ గన్ని అంగీకరించలేదు. దీంతో ఆకుల సత్యనారాయణ జోక్యం చేసుకొని పనుల జాప్యానికి క్షమించాలని, ఇకపై టెండర్లు ఖరారు చేసి, అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తయితే కొబ్బరికాయల కొట్టడం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, పనులు ప్రారంభించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. మునిసిపల్‌ కాలనీ గ్రౌండ్‌ పనులు ఇప్పడే ప్రారంభిస్తామని,వేదికపైకి రావాలని ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు గన్నిని కోరారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను, చంద్రన్న సంక్రాంతి కానుకలను అందజేసారు.అక్కడ నుండి మునిసిపల్‌ కాలనీ గ్రౌండ్‌ కు చేరుకొని అభివ ద్ధి పనులకు ఆకుల సత్యనారాయణ, ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, డివిజన్‌ కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here