నగరంలో మొబైల్‌ అంబులెన్స్‌ సేవలు

0
42

భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఔదార్యం – హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 8367404404

రాజమహేంద్రవరం, జనవరి 8 : పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యా, వైద్య రంగాలలో విశిష్టమైన సేవలు అందిస్తున్న భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ యువనేత, భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో నగర ప్రజలకు మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇరుకుప్రాంతాలోకి కూడా వెళ్ళి రోగులకు సేవలు అందించేందుకు వీలుగా టూవీలర్‌ను అంబులెన్స్‌గా తీర్చిదిద్ది నగర ప్రజలకు అంకితం చేసింది. భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను నేడు స్ధానిక తిలక్‌రోడ్‌లోని సాయిబాబా గుడివద్ద నేడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నగరపాలక సంస్ధ కమిషనర్‌ వి విజయరామరాజు ప్రారంభించారు. నిర్వాహకులు ఆదిరెడ్డి వాసుని, భవానీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలను ఈ సందర్భంగా అభినందించారు. వాసు మాట్లాడుతూ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 8367404404 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఎవరైనాసరే మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను పొందవచ్చునని వెల్లడించారు. సామాజిక ప్రచార మాద్యం ద్వారా ఈ ఫోన్‌ నెంబర్‌ నగరంలో ప్రతి ఒక్కరికి తెలిపేందుకు యువతను వినియోగించుకుంటున్నామన్నారు. మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను ప్రజలు అధికంగా వినియోగించుకునే పరిస్థితుల్లో ఇటువంటి మొబైల్‌ అంబులెన్స్‌లను మరిన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమ ట్రస్ట్‌ ద్వారా నిర్వహిస్తున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా మొబైల్‌ అంబులెన్స్‌ సేవలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ గగ్గర సూర్యనారాయణ, స్వర్ణాంధ్ర నిర్వాహకులు డాక్టర్‌ గుబ్బల రాంబాబు, హెల్పింగ్‌ హేండ్‌ నిర్వాహకులు అనూప్‌జైన్‌, డాక్టర్‌ చింతకుంట రజనీష్‌రెడ్డి, బూరాడ భవానీశంకర్‌, కడితి జోగారావు, బుడ్డిగ రవి, మేరపురెడ్డి రామకృష్ణ, ఖాసిం, ఎం వరప్రసాద్‌, చొప్పెర్ల బ్రహ్మాజీ, మాకాని లక్ష్మణరావు, సుభాన్‌ వలీ, భేరి మోహిత్‌, బిల్డర్‌ బాబి, విక్రమ్‌ సందీప్‌ చౌదరి, పెద్దఎత్తున యువత పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here