విమానయానం సేవలు విస్తృతం

0
37

రాజమహేంద్రవరం, జనవరి 9 : జనవరి 9 : మధురపూడి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాయాన సంస్థ నేటి నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైల మధ్య ఈ కొత్త విమాన సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే స్పైస్‌ జెట్‌, ట్రూ జెట్‌ సంస్థలు చెరి రెండేసి చొప్పున విమానాలను నడుపుతుండగా, జెట్‌ ఎయిర్‌వేస్‌ నాలుగు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. కాగా ఇండిగో సంస్థ కూడా హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు నగరాలకు నేటి నుంచి ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభించింది. వీటిలో హైదరాబాద్‌కు నాలుగు, బెంగళూరు, చెన్నై నగరాలకు రెండేసి చొప్పున సర్వీసులను నడుపుతోంది. దీంతో రాజమహేంద్రవరం నుంచి ఈ మూడు నగరాలకు మొత్తం 16 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. ఇండిగో సర్వీసుల ద్వారా దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు రాజమహేంద్రవరం నుంచి ఎయిర్‌ కనెక్ట్‌విటీ అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. సంక్రాంతి పండుగ వేళ రైళ్ళు, బస్సులు సర్వీసులకు విపరీతమైన గిరాకీ ఏర్పడటంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్ధికంగా స్థోమత ఉన్న వారికి ఈ విమాన యాన సర్వీసులు ఉపయుక్తంగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here