మానవతా దృక్పథంతో న్యాయం చేయండి

0
45

ఇందిరాసత్యనగర్‌పుంత సమస్యపై మాజీ ఎంపి హర్షకుమార్‌ వినతి

రాజమహేంద్రవరం, జనవరి 9 : గత 50 సంవత్సరాలుగా నివాసం వుంటున్న 44,47 వార్డుల పరిధిలోని ఇందిరాసత్యనగర్‌పుంత వాసుల సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు పునరాలోచించి మానవతాధృక్పధంతో వారికి న్యాయం చేయాలని మాజీ ఎంపి జి.వి.హర్షకుమార్‌ అన్నారు. గత నెల రోజులుగా బాధితులు రోడ్డుఎక్కి నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇందిరాసత్యనగర్‌వాసులు చేపట్టిన దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరం వద్ద హర్షకుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తనకు చిన్నప్పటి నుండి ఇందిరాసత్యనగర్‌ పుంత గురించి తెలుసునని, ఈ ప్రాంతం అంతా అడవిగా వుండే సమయంలో పుంతలో నివాసం వుండేవారిని రక్షణగా చుట్టుప్రక్కలవారు భావించేవారన్నారు. గతంలో ఎసివై చైర్మన్‌గా వుండగా, ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా వుండగా మాస్టర్‌ప్లాన్‌లోని 80 అడుగుల రోడ్డును 40 అడుగులకు కుదించి మిగిలిన 40 అడుగుల్లో జిప్లస్‌2 ఇళ్ల నిర్మాణం చేపట్టే విధంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయస్ధానం, లోకాయుక్త ఉత్తర్వులు బాధితులకు అనుకూలంగా వున్నా అధికారులు ఎందుకు అంత పట్టింపుగా వున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధులకు ఏమైనా ప్రయోజనాలు వున్నాయా అనే అనుమానం అందరిలో కలుగుతోందన్నారు. సెంట్రల్‌జైలు నుండి క్వారీమార్కెట్‌కు రోడ్డు వుండగా ఈ రోడ్డును 80 అడుగులకు విస్తరించడం వల్ల ఉపయోగమేమి వుండదన్నారు. సమాంతరంగా చాలారోడ్లు వున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుని మానవత్వాన్ని ప్రదర్శించాలన్నారు. సమావేశంలో బిసి సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here