అందరి కళ్ళల్లో ఆనందం కోసమే వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌

0
40

పుష్కరఘాట్‌ వద్ద రెండురోజులపాటు నిర్వహణ

రాజమహేంద్రవరం, జనవరి 9 : సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్న సంకల్పంతో రేపటి నుండి రెండురోజులపాటు పుష్కరఘాట్‌ వద్ద వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు స్వర్ణాంధ్ర వ్యవస్థాపక కార్యదర్శి లయన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అడ్మిన్‌ అనూప్‌ జైన్‌, సభ్యులు బండ్ల శంకర్‌, జైన్‌ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్‌ జైన్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2016-2017 సంవత్సరాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని అప్పటి సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌, కమిషనర్‌ విజయరామరాజు మార్గదర్శకంలో సుమారు 20వేలమందికి బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వినియోగించిన దుస్తులను పేదలకు పంచే విషయంలో ప్రజల నుంచి అమోఘమైన స్పందన లభించిందని, ఇప్పటికీ ఎవరో ఒకరు తమ ఇండ్ల నుంచి వస్త్రాలను స్వర్ణాంధ్ర సంస్థ వద్దకు తెస్తున్నారని తెలిపారు. ప్రస్తుతానికి 2500 జతల వస్త్రాలను శుభ్రపరిచి ప్యాక్‌ చేయడం జరిగిందని తెలిపారు. తమ ఇళ్ళల్లో ఉండే వస్త్రాలను ఇవ్వదలచుకున్న వారు రేపు, ఎల్లుండి పుష్కరఘాట్‌ వద్దకు తీసుకువస్తే వాటిని అవసరమైన వారికి అందజేస్తామన్నారు. నగరంలో పలుచోట్ల వాల్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు మారుమూల ఏజెన్సీలో కూడా నిర్వహించామని తెలిపారు. స్వర్ణాంధ్ర సేవా సంస్థతోపాటు హెల్పింగ్‌ హ్యాండ్స్‌, లయన్స్‌ క్లబ్‌, జెసిఐ, జైన్‌ సేవా సమితి పూర్తిగా కృషిచేస్తున్నాయన్నారు. అనూప్‌ జైన్‌, బండ్ల శంకర్‌ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వస్త్రాలను పంపిణీ చేసే ఈ కార్యక్రమంలో తాము భాగస్వామ్యులుగా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here