విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ర్యాలీ, ధర్నా

0
38

రాజమహేంద్రవరం, జనవరి 9 : తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్ట్‌ కార్మికులు, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలలోని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు ఈరోజు నల్లబ్యాడ్జీలు ధరించి గోదావరి గట్టున ఉన్న ఎస్‌.ఇ. కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 23 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ సర్వీస్‌లను సంస్థలో విలీనం చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలివ్వాలని తదితర డిమాండ్లతో వారు నినాదాలు చేశారు.విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెకు వెళతామని ఈమేరకు ఆపరేషన్‌ ఎస్‌ఇ వై.వి.ఎస్‌.ప్రసాద్‌కు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్‌ వి. ప్రేమ్‌కుమార్‌, జిల్లా కన్వీనర్‌ వై.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here